ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ గ్లోబల్ లూనార్ క్యూబ్ శాట్ ‘మిషన్ శక్తిశాట్’ కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన కందుల జెస్సీ, మిషన్ శక్తిశాట్ డైరెక్టర్ శ్రీమతి కేశన్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ధవళేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కందుల జెస్సీ.. ‘మిషన్ శక్తిశాట్’ ఎంపికై రికార్డ్ సృష్టించారు. మిషన్ శక్తిశాట్ కు ఎంపికై రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ఈ సందర్భంగా కందుల జెస్సీని మంత్రి లోకేష్ అభినందించారు.