కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సింగ్ విభాగానికి శుభారంభం లభించింది.భారత యువ బాక్సింగ్ సంచలనం జాదుమణి సింగ్ ప్రిక్వార్టర్స్ (రౌండ్ 16)లో పాకిస్థాన్‌కు చెందిన బాక్సర్ సుమామ రెహమాన్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు సగర్వంగా దూసుకెళ్లాడు. ఉత్కంఠభరితంగా జరిగిన రౌండ్-16 పోరులో 22 ఏళ్ల మణిపూర్ బాక్సర్ జాదుమణి సింగ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాడు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన రోజున పాక్ బాక్సర్‌పై భారత్ విజయం సాధించడంతో జాదుమణి సింగ్ గెలుపు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.