ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్ధులు భారీ ఎత్తున పార్లమెంట్ మార్చ్ నిర్వహించింది. ‘సంసద్ చలో’ పేరుతో నిరసన తెలుపుతూ విద్యార్థులు చేపట్టిన పాదయాత్రపై పోలీసులు విరుచుకుపడ్డారు. లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనల్లో భారీ ఎత్తున విద్యార్ధులు గాయపడ్డారు. శాంతియుత నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా హామీ ఇవ్వబడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ చేయకూడదని తేల్చిచెప్పింది.