అమెరికాలోని సియాటెల్ సెంటర్ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ కార్యక్రమం జరుగుతుండగా కాల్పుల ఘటన చోటుచేసుకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడినట్లు సియాటెల్ పోలీసు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించారు. వీరిలో ఒక మహిళ
పరిస్థితి విషమంగా ఉండగా ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోంది. మిగిలిన ముగ్గురిలో రెండేళ్ల
పిల్లాడు ఉన్నట్లు హార్బర్వ్యూ ప్రతినిధి సూసన్ గ్రెగ్ తెలిపారు.