వాయవ్య బంగాళాఖాతం అంటే ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో వాయుగుండంగా ఏర్పడింది. అది నేటి మధ్యాహ్నానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు.. కోస్తాంధ్రలోని అంబేద్కర్ కోనసీమ, పోలవరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటోంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది.