మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర కలకలం రేగింది. అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడమే కాకుండా, పలుమార్లు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆయన కోడలు మేఘన పోలీసులను ఆశ్రయించారు. పెళ్లయిన నాటి నుంచే అత్తమామల వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. మరో రూ. 5 కోట్లు అదనపు కట్నంతో పాటు, పాడుగూడెంలో ఒక ఇల్లు, అత్త ఆడపడుచులకు వజ్రాభరణాలు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు.