ఎపిలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదయింది. శనివారం ఒక్కరోజే ఎపిలో మరో 10 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరగా, ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 24 మంది చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు వెలుగుచూడగా, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది.