loader

అభిషేక్‌ హాఫ్‌ సెంచరీ.. సిక్స్‌ల్లో కొత్త రికార్డు

ఇంగ్లాండ్ లో జరుగుతున్న తొలి టి20లో అభిషేక్ శర్మ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదేవిధంగా టీ20ల్లో (పూర్తి సభ్యదేశాలు) తక్కువ బంతుల్లో (785) వంద సిక్స్ లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 11 ఓవర్లకు భారత్ స్కోరు 110/3. తిలక్ వర్మ 11*, శ్రేయస్ అయ్యర్ 39* క్రీజులో ఉన్నారు. సంజు శాంసన్ (1), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చారు.

నారాయణ, శ్రీ చైతన్య కిచెన్‌లో తనిఖీలు.. నోటీసులు జారీ

శ్రీ చైతన్య గ్రూప్ సెంట్రల్ కిచెన్ లో, మాదాపూర్ లోని నారాయణ గ్రూప్ సెంట్రల్ కిచెన్లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. వంటగదిలో నీరు నిల్వ ఉండటం, ఈగల బెడద, తెరిచి ఉన్న డస్ట్ బిన్లు, తాజా నీటి పరీక్ష నివేదికలు లేకపోవడం, వేడి నీటితో యంత్రాలు శుభ్రం చేయకపోవడం, కిచెన్లో పిల్లులు, వీధి కుక్కల సంచారిస్తున్నాయని, వంటశాల అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. శ్రీ చైతన్య సంస్థకు హైజీన్ స్కోర్ 67 శాతం, నారాయణ […]

హీరో నానికి గాయం!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గాయపడినట్లు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తన చేతికి కట్టు ఉన్న ఫోటోలను నాని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, ఈ గాయం ఎలా అయింది, దీని తీవ్రత ఎంత అనే విషయాలపై ఆయన నేరుగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఆ పోస్టులో కెమెరా ఎమోజీని జోడించడంతో..చిత్రీకరణ సమయంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని టాలీవుడ్ […]

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్.. పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద హై టెన్షన్..!

యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని పిఠాపురానికి తరలించినట్లు సమాచారం. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో రావణ్ తరఫు న్యాయవాదులు, మద్దతుదారులు, పలు దళిత  సంఘాల నాయకులు, జై భీంరావ్ పార్టీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో  క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అక్కడ  […]

మొరాకో చేతిలో నెదర్లాండ్స్ ఓటమి.. ఆటగాళ్లపై రేసిజం దాడి!

ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ మ్యాచ్ మొరాకో చేతిలో ఓడిపోయిన నెదర్లాండ్స్ జట్టుకు ఆన్ లైన్లో లో ఘోర అవమానం ఎదురైంది. పెనాల్టీ షూటౌట్లో తప్పు చేసిన ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో అసహ్యకరమైన రేసిజం వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ దారుణమైన చర్యను డచ్ ఫుట్ బాల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ రేసిజం వ్యాఖ్యలపై ఆన్లైన్ వివక్ష  నిరోధక విభాగానికి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు బోర్డు తెలిపింది.

ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు.. ఆ 134 మూవీ సాంగ్స్‌పై వివాదం ఏంటి ?

ఇళయరాజా మ్యూజిక్ అందించి 1976 నుంచి 2001 మధ్య కాలంలో రిలీజైన 134 మూవీల ఆడియో హక్కులు ప్రముఖ ఆడియో కంపెనీ సరిగమ ఇండియా లిమిటెడ్ తాము ఆ మూవీల ప్రొడ్యూసర్లతో అఫీషియల్‌గా ఒప్పందాలు కుదుర్చుకున్నామని కోర్టును ఆశ్రయించింది.ప్రపంచవ్యాప్తంగా తమకే పర్మినెంట్ కాపీరైట్ హక్కులు ఉన్నాయని సరిగమ వాదిస్తోంది. గతంలోనే ఇళయరాజాకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని ఇళయరాజా కోరగా, కోర్టు దానికి నిరాకరిస్తూ పైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు పాత […]

ఎయిడ్స్ తో ప్రముఖ నటి మృతి…షాక్ లో చిత్రసీమ

హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ నటి, మాజీ చైల్డ్ ఆర్టిస్ట్ డేవీ చేస్ (35) లాస్ ఏంజిల్స్‌లోని ఒక ఆసుపత్రిలో జూన్ 16న కన్నుమూశారు. డేవీ చేస్ ప్రమాదకరమైన ఎయిడ్స్ (AIDS) వ్యాధి బారిన పడి, దాని తీవ్రత వల్ల తలెత్తిన మెనింజైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వంటి ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో నిర్ధారించారు. డేవీ చేస్ తన 13 ఏళ్ల […]

వాట్సాప్ యూజర్‌నేమ్స్‌పై మెటాకు కేంద్రం షాక్..! నోటీసులు జారీ

భారత్‌లో వాట్సాప్‌లో ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటా కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని మెటాను కేంద్రం ఆదేశించింది. అలాగే, ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారతదేశంలో ఈ ఫీచర్‌ను విడుదల చేయవద్దని స్పష్టమైన సూచనలు […]

ఖమేని అంత్యక్రియలకు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించిన ఇరాన్

ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ అంత్యక్రియలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇరాన్ ఆహ్వానించింది. ఈ నెల 4న ఖమేని అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. ప్రధాన కార్యక్రమాలు జూలై 5 నుంచి 9 వరకు జరుగుతాయి. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో అయతొల్లా ఖమేని (86)తోపాటు పలువురు అతడి కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON