శ్రీ చైతన్య గ్రూప్ సెంట్రల్ కిచెన్ లో, మాదాపూర్ లోని నారాయణ గ్రూప్ సెంట్రల్ కిచెన్లో సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. వంటగదిలో నీరు నిల్వ ఉండటం, ఈగల బెడద, తెరిచి ఉన్న డస్ట్ బిన్లు, తాజా నీటి పరీక్ష నివేదికలు లేకపోవడం, వేడి నీటితో యంత్రాలు శుభ్రం చేయకపోవడం, కిచెన్లో పిల్లులు, వీధి కుక్కల సంచారిస్తున్నాయని, వంటశాల అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. శ్రీ చైతన్య సంస్థకు హైజీన్ స్కోర్ 67 శాతం, నారాయణ సంస్థకు హైజీన్ స్కోర్ 71% ఇచ్చారు.