యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని పిఠాపురానికి తరలించినట్లు సమాచారం. అనంతరం ఆయనను పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో రావణ్ తరఫు న్యాయవాదులు, మద్దతుదారులు, పలు దళిత సంఘాల నాయకులు, జై భీంరావ్ పార్టీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సాయంత్రం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.