భారత్‌లో వాట్సాప్‌లో ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మెటా కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని మెటాను కేంద్రం ఆదేశించింది. అలాగే, ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారతదేశంలో ఈ ఫీచర్‌ను విడుదల చేయవద్దని స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.