హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ అమెరికన్ నటి, మాజీ చైల్డ్ ఆర్టిస్ట్ డేవీ చేస్ (35) లాస్ ఏంజిల్స్‌లోని ఒక ఆసుపత్రిలో జూన్ 16న కన్నుమూశారు. డేవీ చేస్ ప్రమాదకరమైన ఎయిడ్స్ (AIDS) వ్యాధి బారిన పడి, దాని తీవ్రత వల్ల తలెత్తిన మెనింజైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వంటి ఆరోగ్య సమస్యలతో మరణించినట్లు కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తాజాగా విడుదల చేసిన నివేదికలో నిర్ధారించారు. డేవీ చేస్ తన 13 ఏళ్ల వయసులోనే డ్రగ్స్ కు బానిసయ్యారు.