loader

జర్మనీలో కాల్పులు.. ఐదుగురి మృతి

జర్మనీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడే పట్టణంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో షూటర్ అనుమానిస్తున్న వ్యక్తితో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హాంబర్గ్క పశ్చిమాన ఉండే ఈ స్టాడే పట్టణంలోని యువజన సంక్షేమ కేంద్రం సమీపంలో కాల్పులు జరిగాయి. మృతుల వివరాలను ప్రకటించినప్పటికీ.. గాయపడిన వారి సంఖ్య పేర్కొనలేదు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు స్టాడే పట్టణ కేంద్రానికి వెలుపల […]

యూరప్‌లో వడగాలులు 1,300కుపైగా మరణాలు! ఫ్యాన్లు, ఏసీల కోసం జనం పరుగులు!

ఐరోపా ప్రస్తుతం రికార్డు స్థాయిలో వేడిమి బారిన పడింది. నైరుతి ఐరోపాలో ప్రారంభమైన తీవ్రమైన వడగాలులు ఇప్పుడు తూర్పు ఐరోపాకు  వ్యాపించి, ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రత రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్, లిథువేనియాతో సహా  పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. ఈ వడగాలుల కారణంగా ఐరోపాలో ఇప్పటివరకు కనీసం 1,300 మంది ప్రాణాలు  కోల్పోగా, ఒక్క ఫ్రాన్స్‌లోనే 1,000కి పైగా మరణాలు నమోదయ్యాయి. పారిస్, ఇల్-డి-ఫ్రాన్స్ […]

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ పోస్టర్ వచ్చేసిందోచ్ !!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం  పట్టాలెక్కబోతోంది. ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ఒక పవర్‌ఫుల్ త్రిశూలం పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ ప్రాజెక్ట్‌ను  కన్ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్‌కు జోడించిన ‘ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్’ (దివ్యమైన శివుని పుత్రుడు,  పార్వతీదేవి గర్వకారణం, శాశ్వతమైన సేనాధిపతి) అనే క్యాప్షన్ […]

పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కమర్షియల్ కొనుగోళ్లపై విధించిన పరిమితులను కేంద్రం ఎత్తివేసింది. పశ్చిమాసియా  ఉద్రిక్తతల నేపథ్యంలో జూన్ 12న జారీ చేసిన తాత్కాలిక నియంత్రణ ఉత్తర్వులను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ  ఉపసంహరించుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి (జులై 1) ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.

షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలకు నారా లోకేశ్ భరోసా

“మీరు కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టండి.. విద్యాశాఖ మంత్రిగా మీ ఉన్నత ఆశయాలను నెరవేర్చేందుకు నా వంతు పూర్తి అండగా ఉంటాను” అని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు బలమైన భరోసా ఇచ్చారు. సమాజంలో ఆశించిన మార్పులు రావాలంటే యువతరం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ‘షైనింగ్ స్టార్స్’ వేడుకలో గత  విద్యాసంవత్సరం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో పది, ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి ఘనంగా  […]

అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి- చంద్రబాబు సూచన

రాజధాని అమరావతిని యావత్ దేశం గర్వించే నగరంగా, హైదరాబాద్ ప్లస్ స్థాయిలో నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ప్రముఖ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో సీఎం  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ – ప్రైడ్ ఫర్ ఇండియా అని అభివర్ణించిన ఆయన.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములైనందుకు కాంట్రాక్టర్లు గర్వపడాలని, నిర్దేశిత గడువు కంటే ముందే పనులను పూర్తి చేసి తమ […]

అయోధ్య ఆలయ హుండీ కేసు.. నిందితులకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ

రామజన్మభూమి రామాలయ చందాల కేసులో నిందితులందరిని జైలుకు తరలించారు. రామ్‌లల్లాకు విరాళాలు, భారీ స్థాయి హుండీలు కాజేశారనే ఆభియోగాలతో ఎనమండుగురును అరెస్టు చేశారు. వీరిని సోమవారం ఫైజాబాద్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. వీరందరిని 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపించండని ప్రత్యేక న్యాయమూర్తి రజత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ విచారణ తరువాత ఆదేశించారు. వీరి ఇంతకు ముందటి జుడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీరిని కోర్టులో ప్రవేశపెట్టారని ప్రాసిక్యూషన్ ప్రత్యేకాధికారి ఉమేష్ దూబే మీడియాకు తెలిపారు.

భూకంపం మిగిల్చిన గుండెకోత.. భార్యాబిడ్డల్ని కోల్పోయిన ఫుట్‌బాలర్..!

వెనిజువెలాలో సంభవించిన భయానక భూకంపంఓ ఫుట్‌బాలర్ కుటుంబాన్ని కూడా బలిగొన్నది. వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విపత్తు కారణంగా అర్జెంటీనా ఫుట్‌బాలర్ ల్యూకస్ త్రెజో తన భార్య, పిల్లల్ని కోల్పోయాడు. భూకంపం విషయం తెలిసిన ల్యూకస్ తన భార్యాబిడ్డల ఆచూకీ కోసం మూడు రోజులు గాలించాడు. తనవాళ్లు బతికే ఉంటారనే ఆశతో వెతికిన అతడికి కన్నీళ్లే మిగిలాయి. తన ప్రాణానికి ప్రాణమైన వారిని విగతజీవులుగా చూసిన ఫుట్‌బాలర్ గుండెలవిసేలా రోదించాడు.

పవన్ కళ్యాణ్‌కు రొటేటర్ కఫ్ గాయం.. ముంబై అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. మన భుజం కీలు చుట్టూ కండరాలు, స్నాయువులు ఉంటాయి. ఈ సమూహాన్ని కలిపి రొటేటర్ కఫ్ అని పిలుస్తుంటారు. ఈ భాగానికి గాయమైతే […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON