ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబై అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. మన భుజం కీలు చుట్టూ కండరాలు, స్నాయువులు ఉంటాయి. ఈ సమూహాన్ని కలిపి రొటేటర్ కఫ్ అని పిలుస్తుంటారు. ఈ భాగానికి గాయమైతే దానిని రొటేటర్ కఫ్ గాయమని అంటారు