“మీరు కేవలం చదువుపైనే శ్రద్ధ పెట్టండి.. విద్యాశాఖ మంత్రిగా మీ ఉన్నత ఆశయాలను నెరవేర్చేందుకు నా వంతు పూర్తి అండగా ఉంటాను” అని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు బలమైన భరోసా ఇచ్చారు. సమాజంలో ఆశించిన మార్పులు రావాలంటే యువతరం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. ‘షైనింగ్ స్టార్స్’ వేడుకలో గత విద్యాసంవత్సరం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో పది, ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి ఘనంగా సత్కరించారు.