లీక్ చేయడానికి ఇంకా ఏదైనా పరీక్ష మిగిలుందా..
పేపర్ లీకేజీ ఘటనల్లో బీజేపీ నిర్లక్ష్యంపై కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ), కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మరో పేపర్ లీకేజీ. మరో పరీక్ష రద్దు. ఈసారి మహారాష్ట్ర టెట్. దేశంలోని విద్యావ్యవస్థ, పరీక్షా నిర్వహణ వ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థగా మారింది. దేశంలోని ప్రతి యువకుడు అభద్రతతో ఉన్నాడు. ఇది పేపర్ లీకేజీ కాదు. యువత […]
ఏపీలో ఎయిర్‌పోర్టుల్లోనూ మద్యం అమ్మకాలు…
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లోనూ లిక్కర్ విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.ఎయిర్‌పోర్టులలో వైన్ షాపులు, బార్ల ఏర్పాటుకు అనుమతితో పాటుగా లైసెన్స్ ఫీజు, దరఖాస్తు రుసుములను వెల్లడిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. విమానాశ్రయాలలో 24 గంటలు బార్లు, వైన్స్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం నుంచి తిరుపతి విమానాశ్రయానికి (రేణిగుంట) మినహాయింపు ఇచ్చారు.
అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో కంపించిన భూమి!
అఫ్గానిస్తాన్‌లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అఫ్గానిస్తాన్‌లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు.
స్నేహితురాలితో గొడవ.. పెట్రోల్ బాంబు పేల్చుకుని యువకుడి సూసైడ్
బెంగళూరుకు చెందిన నాగేంద్ర (30) అనే వ్యక్తి తన స్నేహితురాలు రమ్యతో కలిసి కారులో ప్రయాణిస్తు క్రమంలో వారిద్దరి మధ్య వాదనజరగడంతో నాగేంద్ర తమకూరు జిల్లా సీరా సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే పెట్రోల్ బాంబుతో ఆత్మహుతికి పాల్పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో భారీగా మంటలు చెలరేగడంతో హైవేపై పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. రమ్యతన ప్రేమను అంగీకరించకపోవడం వల్లే నాగేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు […]
వెనెజువెలా విలయంలో 18 రోజుల మృత్యుంజయురాలు
వెనెజువెలాలో బుధవారం సాయంత్రం జంట భూకంపాలలో ,వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోవడం తెలిసిందే. ఓ ప్రాంతంలో 18 రోజుల పసికందు తల్లితోసహా శిథిలాల కింద చిక్కుకుపోయింది. అక్కడ రెస్కూ సిబ్బంది ఒక్కో సిమెంట్ దిబ్బను తొలగించగా, చివరకు ప్రయత్నం ఫలించి ఆ రోజుల బిడ్డ ప్రాణాలతో కనిపించింది. చిన్నగాయం లేకుండా పాలకోసం ఎదురుచూస్తున్న ఆ బిడ్డను చూసి ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఆ తల్లి కూడా సజీవంగా ఉంది.
ప్రమాదవశాత్తు తెగిపడిన లిఫ్ట్.. 8 మందికి గాయాలు
మీర్‌పేటలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. స్థానిక హనుమాన్ నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ చూసేందుకు వెళ్లిన కొంతమంది వ్యక్తులు ఐదో అంతస్తు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సొంత అపార్ట్‌మెంట్ ఖాళీ చేయనున్న సల్మాన్ ఖాన్..
బాలీవుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తనతోపాటు కుటుంబ సభ్యుల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఉంటున్న ముంబై, బాంద్రాలోని గెలాక్సీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని నిర్ణయించారు. తనకు మరింత భద్రత కల్పించే కొత్త బిల్డింగులోకి మారబోతున్నారు. దాదాపు 50 ఏళ్లుగా ఉంటున్న ఇంటిని విడిచిపెట్టబోతున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదిరింపులు, తన ఇంటివద్ద కాల్పుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కొత్త ఇంటిలోకి మారాలని నిర్ణయించుకున్నారు.
రేపటి నుంచి తెలంగాణలో పల్స్ పోలియో
తెలంగాణ రాష్ట్రాన్ని పోలియో రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆదివారం (జూన్ 28) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది.ఆదివారం ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పల్స్ పోలియో బూత్‌లలో ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు.
టీవీకే మంత్రి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు.. ఐపీఎల్ నాటి వీడియో వైరల్
తమిళనాడు అధికార టీవీకే మంత్రి శరత్ కుమార్‌కు సంబంధించిన పాత వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఉన్న ఆయన ఒక స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై పొడి లాంటి పదార్థాన్ని ఏటీఎం కార్డు, రూ. 500 నోటుతో సరిచేస్తున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.తన భార్య, కుమార్తెతో కలిసి రెండు నిమిషాల వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రెండేళ్ల నాటి పాత వీడియోలో […]

