తమిళనాడు అధికార టీవీకే మంత్రి శరత్ కుమార్‌కు సంబంధించిన పాత వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఉన్న ఆయన ఒక స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై పొడి లాంటి పదార్థాన్ని ఏటీఎం కార్డు, రూ. 500 నోటుతో సరిచేస్తున్న వీడియో క్లిప్ వైరల్ అయ్యింది.తన భార్య, కుమార్తెతో కలిసి రెండు నిమిషాల వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను డ్రగ్స్ సేవించినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. రెండేళ్ల నాటి పాత వీడియోలో కనిపిస్తున్నది డ్రగ్స్ కాదని తెలిపారు