” గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారని” మాజీ సీఎం జగన్ తాజాగా చేసిన ట్వీట్ లో విమర్శించారు.