మినీ వ్యాన్ లోయలో పడి ఆరుగురు మృతి చెందిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లాలో జరిగింది. రాంపూర్ ప్రాంతం ఉర్మాన్ గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున మినీ వ్యాన్ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.లోయలో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పాల వ్యాన్ రామ్ పూర్ నుంచి టెక్లెక్ వెళ్తుండగా కొండ ప్రాంతం కావడంతో మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది.