తాను కులాల గురించి మాట్లాడతానని వైసిపి పదేపదే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వైసిపిని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారు మారడంలేదని అన్నారు.మంగగిరిలో జనసేన నిర్మాణ సారధుల సేకరణ కమిటీ సమావేశంలో
పవన్ మాట్లాడుతూ.. గతంలో వైసిపి నేతలు ఎలా మాట్లాడారో గుర్తులేదా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలతోనే ఓట్లు పడతాయని అనుకోలేమని, వైసిపి హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను పట్టించుకోలేదని, బటన్లు నొక్కితే ఓట్లు పడతాయని వైసిపి అనుకుందని ఎద్దేవా చేశారు.