శంషాబాద్ విమానాశ్రయంలోని చిన్మయ స్కూల్ సమీపంలో ఓ చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ఈమేరకు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.