అమరావతి రాజధాని భూముల పరిశీలన…రాజధాని పనులను పరిశీలించేందుకు వైసీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఉండవల్లి వెళ్లేసరికి రైతులు, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులు, ఉండవల్లి గ్రామస్థులు, అమరావతి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు వైసీపీ నేతల కారులపై రాళ్లు, కోడిగుడ్లు విసిరి టీడీపీ, అమరావతి రైతులు నినాదాలు చేశారు. రాజధానిని అంగీకరించని వైసీపీ తమ ప్రాంతాలలో పర్యటించే హక్కు లేదు అని ధ్వజమెత్తారు.