అయోధ్య విరాళాల చోరీ ఆరోపణలపై ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. “కేవలం కింది స్థాయి ఉద్యోగులు తమంతట తామే సీసీటీవీ కెమెరాలను నిలిపివేసి, వేల కోట్ల రూపాయల విరాళాల్లో అక్రమాలకు పాల్పడగలరా? లేక దీని వెనుక పెద్ద వ్యక్తుల ప్రమేయం కూడా ఉందా?” అని ఆమె ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని, మత విశ్వాసాలను దెబ్బతీసేలా జరిగిన ఈ మోసంపై ఎటువంటి కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయకుండా పారదర్శక విచారణ జరపాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.