బెంగళూరుకు చెందిన నాగేంద్ర (30) అనే వ్యక్తి తన స్నేహితురాలు రమ్యతో కలిసి కారులో ప్రయాణిస్తు క్రమంలో వారిద్దరి మధ్య వాదనజరగడంతో నాగేంద్ర తమకూరు జిల్లా సీరా సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే పెట్రోల్ బాంబుతో ఆత్మహుతికి
పాల్పడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో భారీగా మంటలు చెలరేగడంతో హైవేపై పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. రమ్యతన ప్రేమను అంగీకరించకపోవడం వల్లే నాగేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టినట్లు
పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు