loader

అర్జెంటీనా-అల్జీరియా అభిమానుల ఘర్షణ.. రంగంలోకి పోలీసులు

ఫిఫా 2026 వరల్డ్ కప్ లో అర్జెంటీనా-అల్జీరియా మ్యాచు కొద్ది గంటల ముందు అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ఇరు జట్ల అభిమానులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో అర్జెంటీనా, అల్జీరియా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు మార్చుకుంటూ కనిపించారు.. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో న్యూయార్క్ పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను […]

విషాదం.. బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్

చిప్స్ ప్యాకెట్, చాక్లెట్లు పిల్లలకు చాలా ఇష్టమైన తినుబండారాలు చిప్స్ ప్యాకెట్లలో మిని క్రియేచర్ బొమ్మలు పెట్టి సేల్స్ పెరిగేలా చేసుకుంటున్నాయి. అయితే, ఈ ప్లాస్టిక్ బొమ్మలు మాత్రం చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా, చిప్స్ ప్యాకెట్ లో వచ్చే బొమ్మ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. అనంతపురం జిల్లా గుత్తిలో బాలుడు ఫర్హాన్ (5) చిప్స్ ప్యాకెట్ తింటుండగా  అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి […]

పర్యావరణం నాశనం కావడానికి మగాళ్లే కారణం – బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం SMలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, పర్యావరణ నాశనానికి పితృస్వామ్య వ్యవస్థే ప్రధాన కారణమని, పురుషులే ఈ విధ్వంసానికి ముమ్మాటికీ బాధ్యులని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, దియా మీర్జా మాత్రం వెనక్కి తగ్గలేదు. పురుషాధిక్య సమాజం మహిళలను, ఆడపిల్లలను అణచివేయడానికి ప్రయత్నిస్తుందో.. అలాగే ప్రకృతిని, భూమిని చూస్తోందని […]

ఇంటింటికీ టీడీపీ.. కొత్త కార్యక్రమానికి మంత్రి లోకేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు.

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే గుడ్‌బై.. ఐదుకు చేరిన రాజీనామాల సంఖ్య

తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు.తమిళనాడు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, విరాలిమలై ఎమ్మెల్యే విజయ్‌ భాస్కర్‌ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్‌  జేసీడీ ప్రభాకర్‌ ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్‌ ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా  శారు.వీళ్లాంతా గతంలో విజయ్‌ బలపరీక్ష సందర్భంగా కూడా ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.

ఏపీపీఈసెట్ ఫలితాల విడుదల..! ఇలా చెక్ చేస్కోండి..!

ఏపీలో వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో (బీపీఈడీ, డీపీఈడీ) ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీపీఈసెట్ (APPECET 2026 Results) ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గా పేర్కొనే ఈ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు. నమోదు చేసుకున్నవారు 4,037 కాగా, ఇందులో పరీక్షకు హాజరైనవారు 2,958. అలాగే అర్హత సాధించినవారు 2,655. https://cets.apsche.ap.gov.in/PECET/  మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009

TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రారంభం కానున్న ‘టీజీ20’ (TG20) క్రికెట్ లీగ్ ప్రచారకర్తగా టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల టోర్నీకి భారీ హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు సంబంధించిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు […]

నోయిడాలో .. పనులు బంద్‌జేసి నిరసనకు దిగిన ఇంటిపని వాళ్లు..|

గ్రేటర్‌ నోయిడాలో ఇంట్లో పనిచేసే మహిళపై యజమాని దాడికి పాల్పడ్డారు. నోయిడాలోని గౌర్‌ సిటీలో గల 11th అవెన్యూ అపార్టుమెంట్‌ కాంప్లెక్స్‌లో ఈ దాడి ఘటన స్నబ్బిట్‌ (Snabbit) అనే ఇన్‌స్టాంట్‌ యాప్‌ ద్వారా క్షణాల్లో సిటీ అంతా పాకింది. దాంతో సిటీలోని పనిమనుషులంతా కలిసి బాధితురాలికి న్యాయం జరిగేదాకా పనులు చేయవద్దని నిర్ణయించుకున్నారు. అపార్టుమెంట్‌ కాంప్లెక్స్‌ ముందు ఆందోళనకు దిగారు. పనిమనుషులు సేవలు నిలిపేయడంతో గౌర్‌ సిటీతోపాటు పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జీ7 సమ్మిట్‌లో మోదీ-ట్రంప్ భేటీ..స్మైల్స్..కానీ హగ్స్ లేవు..ఎందుకిలా?

ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగే జీ7 సదస్సులో వీరు భేటీ అయ్యారు. ఇలా 16 నెలల తర్వాత వీళ్లు మళ్లీ కలిశారు. కానీ పైపై నవ్వులు, షేక్ హ్యాండే తప్ప.. హగ్గులు లేవు. ట్రంప్ ఈసారి.. మోదీని తన ప్రియమైన మిత్రుడిలా చూడలేదు. అంత ప్రత్యేకత చూపించలేదు. ట్రంప్ అంత ఆసక్తి చూపించకపోయి ఉండొచ్చు. ఇటు ప్రధాని మోదీ సైతం.. కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు […]

G7 సదస్సు కోసం స్లోవేకియా నుంచి ఫ్రాన్స్‌కు బయలుదేరిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్లోవేకియా పర్యటనను ముగించారు. ఈ పర్యటనను “చారిత్రాత్మకమైనది మరియు ఫలప్రదమైనది”గా అభివర్ణించిన ఆయన, దీని ఫలితాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భారత్-స్లోవేకియా సంబంధాలలోని ఆప్యాయతను ప్రతిబింబించేలా, పర్యటన ముగింపు సందర్భంగా స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో స్వయంగా వచ్చి ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. స్లోవేకియా ప్రభుత్వం మరియు ప్రజలకు వారి ఆతిథ్యం మరియు ఘన స్వాగతం పట్ల ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON