తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) కు మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు.తమిళనాడు ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, విరాలిమలై ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సచివాలయంలో అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారు.ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.వీళ్లాంతా గతంలో విజయ్ బలపరీక్ష సందర్భంగా కూడా ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు.