ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగే జీ7 సదస్సులో వీరు భేటీ అయ్యారు. ఇలా 16 నెలల తర్వాత వీళ్లు మళ్లీ కలిశారు. కానీ పైపై నవ్వులు, షేక్ హ్యాండే తప్ప.. హగ్గులు లేవు. ట్రంప్ ఈసారి.. మోదీని తన ప్రియమైన మిత్రుడిలా చూడలేదు. అంత ప్రత్యేకత చూపించలేదు. ట్రంప్ అంత ఆసక్తి చూపించకపోయి ఉండొచ్చు. ఇటు ప్రధాని మోదీ సైతం.. కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.