తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రారంభం కానున్న ‘టీజీ20’ (TG20) క్రికెట్ లీగ్ ప్రచారకర్తగా టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల టోర్నీకి భారీ హైప్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు సంబంధించిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రేపు హైదరాబాద్‌లోని చారిత్రాత్మక ట్యాంక్‌బండ్‌పై అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.