బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త దియా మీర్జా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం SMలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, పర్యావరణ నాశనానికి పితృస్వామ్య వ్యవస్థే ప్రధాన కారణమని, పురుషులే ఈ విధ్వంసానికి ముమ్మాటికీ బాధ్యులని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, దియా మీర్జా మాత్రం వెనక్కి తగ్గలేదు. పురుషాధిక్య సమాజం మహిళలను, ఆడపిల్లలను అణచివేయడానికి ప్రయత్నిస్తుందో.. అలాగే ప్రకృతిని, భూమిని చూస్తోందని ఆమె విమర్శించారు.