loader

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

దేశవ్యాప్తంగా రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయింది. టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామ కృష్ణ, చింతకాయల విజయ్ పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు ఏపీ సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించారు.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత మిరా ఆండ్రీవా

ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ విజేతగా రష్యన్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్.. మిరా ఆండ్రీవా నిలిచారు. ఆమె పారిస్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో పోలెండ్కు చెందిన చ్వాలిన్స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. రెండు వరుస సెట్లలో ఆండ్రీవా ఆధిక్యం ప్రదర్శించింది. 2014లో మరియా షరపోవా తర్వాత.. ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన రష్యా అమ్మాయిగా ఆండ్రీవా రికార్డ్ సృష్టించింది. ఆమెకు ఇది కెరీర్లో తొలి గ్రాండ్లమ్ […]

ఇది ట్రయలరే.. ముందుంది అసలు హోరు: కాక్రోచ్ పార్టీ హెచ్చరిక

ఢిల్లీలో శనివారం జరిగింది కేవలం ట్రయలర్ అని, ఇకపై మరింత ఉధృత రీతిలో తమ ఆందోళన ఉంటుందని కాక్రోచ్ జనతాపార్టీ నేత అబిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శన తరువాత ఆయన వాట్సాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు వెలువరించారు. ఇది ఆరంభమే , ఇకపై ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి నేరుగా వచ్చి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తరువాత ఆయన మహారాష్ట్రలోని తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు బయలుదేరి వెళ్లారు.

బిల్లులు చెల్లించండి.. లేకపోతే ఉద్యమమే: కాంట్రాక్టర్ల హెచ్చరిక

రాష్ట్రంలో కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వం వెంటనే రూ.20 వేల కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. జూన్ 18న హైదరాబాద్ లో నిర్వహించనున్న “మా బిల్లులు – రాష్ట్ర అభివృద్ధి” (చలో హైదరాబాద్) మహాసభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వివాదాస్పద చెల్లింపు విధానాన్నే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం […]

అమెరికాలో దారుణం.. ఫుడ్ డెలివరీ చేస్తున్న తెలంగాణ యువకుడు కాల్చివేత!

అమెరికాలోని నార్త్ ఫిలడెల్ఫియాలో తెలంగాణకు చెందిన కుంచ అంశుల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కుంచ అంశుల్ నార్త్ ఫిలడెల్ఫియాలో పార్ట్ టైమ్ ఉద్యోగంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే విధి నిర్వహణలో భాగంగా ఫుడ్ డెలివరీ ఇస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సడన్ అటాక్‌లో తీవ్రంగా గాయపడిన అంశుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని దూషించిన ఆరోపణలపై కొర్ర చందర్ లాల్ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డాడు. “జనసేనతో పెట్టుకున్నావ్.. రేవంత్ రెడ్డి, నిన్ను బలి ఇస్తాం” అంటూ నేరుగా ప్రాణభీతి కలిగించేలా వ్యాఖ్యలు చేశాడు.

విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించబోతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా సాగుతోంది. అదే విధంగా విద్యార్థులకు కూడా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్టు శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్, భోజనం పెడుతున్నామని చెప్పారు.

చంచల్‌గూడ జైలుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

రంగారెడ్డి జిల్లా గండిపేటలోని సర్వే నంబర్‌ 18లో సుమారు రూ.1,500 కోట్ల భూమి కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మనాయుడిని పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. కాగా బ్రహ్మనాయుడిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రహ్మనాయుడిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON