ఫ్రెంచ్ ఓపెన్లో మహిళల సింగిల్స్ విజేతగా రష్యన్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్.. మిరా ఆండ్రీవా నిలిచారు. ఆమె పారిస్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్ పోరులో పోలెండ్కు చెందిన చ్వాలిన్స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. రెండు వరుస సెట్లలో ఆండ్రీవా ఆధిక్యం ప్రదర్శించింది. 2014లో మరియా షరపోవా తర్వాత.. ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన రష్యా అమ్మాయిగా ఆండ్రీవా రికార్డ్ సృష్టించింది. ఆమెకు ఇది కెరీర్లో తొలి గ్రాండ్లమ్ టైటిల్ కావడం గమనార్హం.