‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు వస్తున్న వేళ అనసూయ చేసిన పోస్టు ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా కల్పిత కథ. మంచి, చెడు నిర్ణయించుకునే విచక్షణ ప్రేక్షకుడిపైనే ఉంటుంది. చిత్రాలు చూసి పిల్లలు చెడిపోవడం అన్నది సరికాదు. దర్శక రచయితలకు తాము అనుకున్న కథను చెప్పే స్వేచ్ఛ ఉండాలి. అలాగే సమాజం పట్ల బాధ్యతా ముఖ్యమే. ఇకనైనా క్రియేటర్లు బాధ్యతాయుతంగా కంటెంట్ తీసుకొస్తారని ఆశిస్తున్నా.. అని పేర్కొన్నారు.