లింగమనేని రమేష్‌ను జనసేన పార్టీ తన రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితా రాణికి ఆయన తన నామినేషన్ పత్రాలను అధికారికంగా సమర్పించారు. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లింగమనేని రమేష్ అధికారిక బి-ఫామ్’ అందుకున్నారు తనపై నమ్మకంతో ఈ అరుదైన అవకాశం కల్పించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు లింగమనేనిరమేష్.