ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు సీజేపీ ఘన నివాళులు అర్పించింది. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు.