రాంచరణ్ నటించిన పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ సన్నివేశాలు సరిగ్గా వర్కౌట్ కాలేదు అని, బుచ్చిబాబు ఆ సన్నివేశాలని తెరకెక్కించిన విధానం బాగాలేదు అని ఆడియన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఏదైనా సన్నివేశాలు ప్రేక్షకులకు ఇబ్బంది కరంగా అనిపించినట్లు ఉంటే మేము వారి మనో భావాలని గౌరవిస్తాం. ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు కోరుతున్నా. ఫీడ్ బ్యాక్ వచ్చిన సన్నివేశాలని మేము చర్చించి మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం. మహిళల గౌరవానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం అని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు.