ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో న్యూఢిల్లీలో ఒక కీలకమైన ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర గందరగోళం, హెచ్చుతగ్గులు కొనసాగుతున్న తరుణంలో.. భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును మరింతగా ఎలా బూస్ట్ చేయాలనే అంశంపై ప్రధాని ఈ బృందంతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సందర్భంగా చర్చించారు.భారత్ స్థిరమైన వృద్ధిని ఎలా సాధించాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేశారు.