దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ పార్టీ మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలో జంతర్ మంతర్ చేరుకున్నారు. భారీ భద్రత నడుమ ఆందోళన కొనసాగుతోంది. మన అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని, పోస్టులను డిలీట్ చేస్తున్నారని దీప్కే ఆరోపించాడు. మీరు పోస్టులను డిలీట్ చేయవచ్చు, కానీ, మమ్మల్ని మార్చలేరని దీప్కే అన్నారు.