సహారా ఎడారి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉండే అల్జీరియా–మాలీ సరిహద్దుల్లో నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మాలీ దేశానికి చెందిన కొందరు వ్యక్తులు నైజర్లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి బక్రీద్ పండుగను జరుపుకోవాలనే ఆశతో ఒక ట్రక్కులో ప్రయాణమయ్యారు. సహారా ఎడారి మార్గమధ్యలో హఠాత్తుగా ట్రక్కు చెడిపోయింది. నిర్జన ప్రదేశంలో వారు చిక్కుకుపోయారు. ఇద్దరు వ్యక్తులు ఎడారిలో కాలినడకన
అత్యంత సాహసోపేతమైన ప్రయాణం చేసి,వచ్చి చెప్పడంతో ఘోర ఉదంతం వెలుగులోకి వచ్చింది.