ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఈ నిరసనలో పాల్గొనేందుకు అమెరికాలో ఉంటున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇవాళ ఉదయం నగరానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయన అడుగుపెట్టినా బయటికి మాత్రం రాలేదు. మరోవైపు కాక్రోచ్ పార్టీ తమ నిరసనకు అనుమతి లభించినట్లు ప్రకటించింది. ఢిల్లీకి చేరుకుని పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ కు వెళ్లి జంతర్ మంతర్ నిరసనకు అనుమతి తీసుకుంటానని ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిజీత్..కాసేపట్లో పీఎస్ కు వెళ్లనున్నారు.