నల్గొండ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలోని విగ్రహానికి మంటలు అంటుకోవడంతో కాలిపోయింది. ఈ విషయాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అనంతరం మున్సిపల్ సిబ్బంది ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రపరిచే పనులు చేపట్టారు. విగ్రహానికి ఎవరైనా కావాలనే నిప్పంటించారా? లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.