భారతదేశవ్యాప్తంగా ఉన్న ATMs ప్రస్తుతం తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో నగదు సరఫరాకు, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ’ వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఏటీఎంల నిర్వహణకు దాదాపు రూ. 94,000 కోట్ల నగదు అవసరం కాగా.. కేవలం రూ. 54,000 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయని, అంటే దాదాపు రూ. 40,000 కోట్ల భారీ లోటు ఏర్పడిందని నివేదికలో పేర్కొంది.