అత్యాచారం కేసులో మాజీ సీఐ చిన్న మల్లయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌లో ఆయన సరెండర్ అయ్యారు. వినుకొండ మండలానికి చెందిన ఓ మహిళ తనపై సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేసినట్లు ఈ ఏడాది ఏప్రిల్ 29న పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో సీఐతో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఆరోపించింది.