నాయకత్వాన్ని ప్రశ్నించకుండా, ఎలాంటి బేషజాలు లేకుండా కార్యకర్తలు నోరు మూసుకొని పవన్ కళ్యాణ్ వెంటే నడవాలని జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలపై బహుభాషా నటుడు, సామాజిక అంశాలపై స్పందించే ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “మేమేమీ బానిసలుగా బతకడానికి గొర్రెలం కాదు.. ఇలాంటి బెదిరింపు ధోరణి రాజకీయాలకు స్వస్తి పలకాలి; ప్రశ్నించడం అనేది పౌరుడిగా మా హక్కు, ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రజలకు, క్యాడర్‌కు సమాధానం చెప్పాల్సిందే” అంటూ సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.