గోదావరి పుష్కరాల కోసం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి వద్ద నిర్మిస్తున్న ఒక పుష్కర ఘాట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, నారా లోకేష్ కుమారుడైన ‘దేవాన్ష్’ పేరు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైరల్ కావడంతో, దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో ఏ పుష్కర ఘాట్‌కు కూడా ‘దేవాన్ష్’ పేరు పెట్టకూడదని, వెంటనే ఆ బోర్డును తొలగించాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.