తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ రుతుపవనాల రాకతో గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భానుడి భగభగలు, ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి వాతావరణం ప్రశాంతంగా మారనుంది. ప్రస్తుతం ఈ నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతంతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.