loader

గూగుల్‌ నుంచి ఫేక్‌ కాల్‌ డిటెక్షన్

సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్ సాయంతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఫోన్ నంబరు స్పూఫింగ్, ఏఐ వాయిస్ క్లోనింగ్తో తెలిసిన వారిలా కాల్స్ చేసి సున్నిత సమాచారాన్ని పట్టేసి మోసాలకు పాల్పడుతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫేక్ కాల్ డిటెక్షన్ సెక్యూరిటీ ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ద్వారా అవతలి వ్యక్తి చేసిన కాల్ సంబంధిత డివైజ్ నుంచి వచ్చిందో లేదో ఈ ఫీచర్ ఇట్టే పసిగడుతుంది.

స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన డీకే శివకుమార్‌

కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు అందజేస్తామని తెలిపారు. ఎటువంటి ఛార్జీలు లేకుండా వీటిని అందజేసేందుకు తన నేతృత్వంలోని క్యాబినెట్ తొలి నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఈ పథకం గురించి రవాణా శాఖతో చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వ పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని.. ప్రైవేటు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

రిలీజ్‌కు ముందే థియేటర్ల వద్ద రామ్ చరణ్ ఫ్యాన్స్ హంగామా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం పెద్ది విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో థియేటర్ ప్రాంగణాలు ఇప్పటికే రామ్ చరణ్ భారీ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. పలుచోట్ల అభిమానులు బాణాసంచా కాలుస్తూ, తీన్మార్ డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. కటౌట్లకు పాలాభిషేకాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: హోంమంత్రి అనిత

వైసిపి నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే ఓపిక కూడా లేదంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేవలం నోటి మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, ఆధారాలు లేకుండా బురదజల్లే వారిపై క్రిమినల్ కేసులు నమోదు […]

ఈనెల 05వ తేదీ నుంచి భూముల విలువల పెంపు

రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న నేపథ్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు భూముల విలువలను సవరిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భూముల విలువలు ఈనెల 05వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని విస్తృతస్థాయిలో అధ్యయనం నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి […]

సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ షిపోకోసా పౌలస్ మషాటిలే నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరు దేశాలు/రాష్ట్రాల మధ్య ఉన్న విభిన్న వ్యాపార, పెట్టుబడి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు, సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయి ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్..

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ -2025పై సీబీఐ విచారణకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిపించి, అన్నింటా సక్సెస్‌ అయిన అనేక మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయమని మండిపడ్డారు. పలువురు డీఎస్సీ అభ్యర్థులతో వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే, విచారణ కమిషన్ ఏర్పాటు చేసి.. ఈ అక్రమాలపై దర్యాప్తు జరుపుతామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని […]

మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ భార్యకు అమెరికాలో కారు ప్రమాదం

మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ భార్యకు అమెరికాలో కారు ప్రమాదం జరిగింది. సీనియర్ డాక్టర్ అయిన సుచి యాష్కీకి తీవ్ర గాయాలు అయ్యాయనీ… రిబ్స్‌ విరిగాయని డాక్టర్లు తెలిపారు. చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్నట్లు వివరించారు. కూతురు గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి, బోస్టన్ నుంచి న్యూయార్క్ వస్తుండగా.. వర్షం కారణంగా కారు ప్రమాదం జరిగింది. కారులో లగేజీ ఎక్కువగా ఉండటంతో.. మధు యాష్కీ వేరే కారులో ప్రయాణిస్తున్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్

పవన్ మాటలపై దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆమె ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ‘తెలంగాణ ఎవరి జాగీరు?’ అని ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ.. “అవును పవనన్న, ఈ తెలంగాణ గడ్డ నిన్న మా తండ్రుల జాగీరు, ఈరోజు మా జాగీరు, రేపు మా పిల్లల జాగీరు. ఇది ముమ్మాటికీ మా తెలంగాణ ప్రజల జాగీరే” […]

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావు అరెస్ట్

రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు తాజాగా ఆయనను ఏసీబీ (ACB) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. భుజంగరావు అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. భుజంగరావు నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON