రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు తాజాగా ఆయనను ఏసీబీ (ACB) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. భుజంగరావు అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. భుజంగరావు నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు