<span;>ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం, పాక్ గగనతల మూసివేత కారణంగా దేశీయ విమానయాన రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ సరికొత్త వ్యూహాత్మక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్(ATF) ధరల భారం నుంచి విమానయాన సంస్థలను కాపాడేందుకు చమురు సంస్థలకు 10 వేల కోట్లను వడ్డీ లేని ఆర్థిక సాయంగా ప్రకటించింది. దీనివల్ల ఇంధన ధరలు పెరిగినా, విమాన టికెట్ల ధరలు అకస్మాత్తుగా పెరగకుండా ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది