రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న నేపథ్యంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు భూముల విలువలను సవరిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. భూముల విలువలు ఈనెల 05వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని విస్తృతస్థాయిలో అధ్యయనం నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.