వైసిపి నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే ఓపిక కూడా లేదంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేవలం నోటి మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, ఆధారాలు లేకుండా బురదజల్లే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి గట్టిగా హెచ్చరించారు.